టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు: తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు

By narsimha lode  |  First Published Feb 20, 2024, 10:35 AM IST


పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ  వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ  ప్రారంభిస్తుంది.


హైదరాబాద్:  పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా  భారతీయ జనతా పార్టీ  తెలంగాణ రాష్ట్రంలో  విజయ సంకల్ప యాత్రలకు  శ్రీకారం చుట్టింది.  మంగళవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా  నాలుగు చోట్ల నుండి విజయ సంకల్ప యాత్రలు ప్రారంభం కానున్నాయి.  మరో రెండు మూడు రోజుల్లో మరో యాత్ర కూడ  ప్రారంభించనుంది  బీజేపీ.

also read:తెలంగాణలో రేపటి నుండి విజయ సంకల్పయాత్రలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాల్లో  మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో  బీజేపీ ఈ యాత్రలను  బీజేపీ  చేపట్టింది.గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.  2018 ఎన్నికల్లో బీజేపీకి ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం దక్కింది.  అయితే ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో రెండు స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది.

also read:గూగుల్ ఉద్యోగికి 300 శాతం వేతనం పెంపు: ఎందుకో తెలుసా?

2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది.  దీంతో  తెలంగాణలో  రెండంకెల పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని  బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. 

రాష్ట్రంలోని  అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను కవర్ చేసేలా విజయ సంకల్ప యాత్రల రూట్ మ్యాప్ లు తయారు చేశారు.విజయ సంకల్ప యాత్రలో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి.  పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై ప్రజల స్పందనను తెలుసుకుంటారు. మరో వైపు  ఇతర పార్టీల్లోని అసంతృప్తులను కూడ తమ పార్టీలో చేర్చుకోనున్నారు. 

గతంలో విజయం సాధించిన నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు  ఇతర పార్లమెంట్ స్థానాలను కూడ దక్కించుకోవాలని లక్ష్యంతో  కమలదళం  పావులు కదుపుతుంది.  ఈ ఐదు యాత్రల్లో బీజేపీకి చెందిన కీలక నేతలు పాల్గొంటారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు యాత్రలు 5,500 కి.మీ. దూరం పర్యటించనున్నాయి. రాష్ట్రంలోని వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ యాత్రలు సాగుతాయి. 

also read:తెలంగాణలో గ్రూప్-1 : 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ఈ యాత్రల ముగింపును పురస్కరించుకొని నిర్వహించే సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనేలా  బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.  కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీ  ఒంటరిగానే  పోటీ చేస్తామని ప్రకటించింది.  

also read:పెళ్లి పందిరిలోనే వధువు కాళ్లు తాకిన వరుడు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం ఇటీవల కాలంలో  జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని  రెండు పార్టీలు ఖండించాయి.  బీఆర్ఎస్ తో  పొత్తు విషయమై జరుగుతున్న ప్రచారాన్ని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి ఖండించారు.   ఇదే విషయమై  బీఆర్ఎస్ నేత , మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడ తోసిపుచ్చారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని  ప్రజలను నమ్మించేలా చేసిన ప్రచారం కాంగ్రెస్ కు రాజకీయంగా ప్రయోజనం కలిగించిందని  బీజేపీ భావిస్తుంది.

click me!