పార్టీలో గొడవ: బీరు సీసాలతో కొట్టుకున్న ఫ్రెండ్స్, ఒకరి మృతి

Siva Kodati |  
Published : Feb 04, 2019, 07:33 AM IST
పార్టీలో గొడవ: బీరు సీసాలతో కొట్టుకున్న ఫ్రెండ్స్, ఒకరి మృతి

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగి, ఒకరిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ అలీనగర్‌కు చెందిన కొందరు స్నేహితులు ఆదివారం కావడంతో మద్యం సేవించారు. 

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగి, ఒకరిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ అలీనగర్‌కు చెందిన కొందరు స్నేహితులు ఆదివారం కావడంతో మద్యం సేవించారు.

ఈ క్రమంలో మత్తులో ఏదో విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో అజీజ్ అనే వ్యక్తి కోపంతో ఊగిపోతూ... చేతిలో ఉన్న బీర్ సీసాలతో హుస్సేన్ సాది అనే మిత్రుడిని తీవ్రంగా కొట్టాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన స్నేహితులు సాది మృతదేహాన్ని ఓ దుప్పట్లో చుట్టి అక్కడి నుంచి పారిపోయారు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సాది హుస్సేన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో గొడవ జరిగిందా..? లేక సాది-అజీజ్ మధ్య ఏవైనా పాత గొడవలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!