యువతి ఆత్మహత్య.. మూఢనమ్మకం పేరిట..!

Published : Jun 26, 2021, 08:31 AM IST
యువతి ఆత్మహత్య.. మూఢనమ్మకం పేరిట..!

సారాంశం

మరో వైపు ఇప్పటికే మూఢనమ్మకాలు, మంత్రాలు పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. 


ఓ వైపు దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది. అయితే.. అదంతా  నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో వైపు ఇప్పటికే మూఢనమ్మకాలు, మంత్రాలు పేరిట మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

మంత్రాలు నేపంతో  ఓ యువకున్ని గొడ్డలితో నరికి చంపిన ఘటన  ములుగు జిల్లా తాడ్వాయి మండలం బొల్లెపల్లి  గ్రామంలో  చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే తోలెం విజయ్ కుమార్ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన పూనేం సురేష్  (22) యొక్క చెల్లె నీలవేణి 6 నెలల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.విజయ్ కుమార్ మంత్రాలు చేయడం వల్లే తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు. గురువారం రాత్రి సురేష్‌ మృతుడి ఇంటికి గొడ్డలి పట్టుకుని వెళ్లి గొడవ పెట్టుకున్నాడు.

 ఆ తరువాత అతన్ని ఇంటి బయటకు లాక్కొచ్చి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపివేశాడు. మృతుడికి తల్లిదండ్రలు ఎవరూ లేరు. పెద్దమ్మ పూనెం సారక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడ్వాయి ఎస్సై శ్రీ సీఎచ్.వెంకటేశ్వరరావు  కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు