రఘునందన్ రావుకి రాజకీయాల్లో ఓనమాలు కూడ తెలియవు: జగ్గారెడ్డి

Published : Jun 25, 2021, 08:11 PM ISTUpdated : Jun 25, 2021, 08:12 PM IST
రఘునందన్ రావుకి రాజకీయాల్లో ఓనమాలు కూడ తెలియవు: జగ్గారెడ్డి

సారాంశం

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి రాజకీయాల్లో ఓనమాలు కూడ తెలియదని కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకి రాజకీయాల్లో ఓనమాలు కూడ తెలియదని కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.శుక్రవారం నాడు  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు  సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.  సీఎల్పీ బృందం కేసీఆర్ తో భేటీ కావడంపై రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు.

"

also read:మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం

రఘునందన్ రావు ఎమ్మెల్యే కావొచ్చు కానీ రాజకీయాలలో ఓనమాలు కూడా తెలీదన్నారు.  బీజేపీ నేతల మాదిరిగా తాము రాత్రి పూట పోయి  టీఆర్ఎస్  నేతలను  కలవబోమన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన చెప్పారు.మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని తాము నాలుగు రోజులుగా పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. నాలుగు రోజులుగా బీజేపీ మరియమ్మ విషయం పై ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.కొంత మంది పోలీస్ లు కావాలని దళితుల మీద దాడులు చేస్తున్నారు.దానిని నిరసిస్తూ తాము సీఎం కేసీఆర్ ను కలిశామన్నారు. 

 


 

PREV
click me!

Recommended Stories

Agriculture : ఎకరాకు రూ.10 లక్షల లాభం..! ఇలా కదా వ్యవసాయం చేయాల్సింది, ఇది కదా రైతులకు కావాల్సింది
Sankranti Holidays : స్కూళ్లకి సరే.. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు..?