తెలంగాణ బుద్దుని మార్గంలో పయనిస్తోంది: సీఎం కేసీఆర్

By Sumanth KanukulaFirst Published May 16, 2022, 4:57 PM IST
Highlights

గౌతమ బుద్దుడి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బోధనలను స్మరించుకున్నారు. బుద్దుడు చెప్పిన శాంతి, అహింస నేటికీ అనుసరణీయం అని అన్నారు. 

గౌతమ బుద్దుడి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బోధనలను స్మరించుకున్నారు. బుద్దుడు చెప్పిన శాంతి, అహింస నేటికీ అనుసరణీయం అని అన్నారు. తెలంగాణ నేల బౌద్దానికి ప్రధాన కేంద్రంగా ఉందని చెప్పారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో బౌద్దం పరిఢవిల్లిందన్నారు. నాగార్జున సాగర్‌లో అంతర్జాతీయ స్థాయిలో బుద్దవనం నిర్మించామని చెప్పారు. నాగార్జున సాగర్‌లోని బుద్దవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం కానుందన్నారు. తెలంగాణ బుద్దుని మార్గంలో పయనిస్తోందన్నారు. 

ఇక, బుద్ధ పూర్ణిమ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజునే బుద్ధుడు బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు. ఆ తర్వాత  ప్రజలకు జ్ఞానోదయ ప్రసంగాలను చేస్తూ 45 ఏంండ్లు ఇలాగే గడిపాడు.ఆ తర్వాత 80 స౦వత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. 

 బుద్ధ పూర్ణిమను బౌద్ధమతస్థులే కాదు ప్రపంచమంతటా జరుపుకుంటారు. ఈ రోజు శాంతి, అహింస, సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ బుద్ధపూర్ణిమ బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుని జయంతిని తెలియజేస్తుంది. జన్మ మరియు పునర్జన్మల చక్రం నుండి విముక్తి పొందిన తత్వవేత్త, ఆధ్యాత్మిక మార్గదర్శి, మత నాయకుడు, ధ్యాని అయిన గౌతమ బుద్దుడికి గౌరవార్థం ఈ రోజును జరుపుకుంటారు. బుద్ధ పూర్ణిమ రోజున భక్తులు బుద్దుడి దేవాలయాలను సందర్శిస్తారు. బోధి వృక్షం అడుగున నీటిని పోస్తారు, పేదలకు సహాయం చేస్తారు. పూజలు తో పాటుగా ధ్యానం కూడా చేస్తారు.

click me!