హైదరాబాద్‌లో ప్రెగ్నెంట్ మర్డర్...నిందితులపై పీడి యాక్టు నమోదు

First Published Aug 6, 2018, 5:16 PM IST
Highlights

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రెగ్నెంట్ మర్డర్ కేసులో పట్టుబడిన నిందితులపై పోలీసులు పిడి( ప్రివెన్షన్ డిటెక్షన్) యాక్ట్ నమోదుచేశారు. వారిపై ఈ యాక్టు ఉయోగిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రెగ్నెంట్ మర్డర్ కేసులో పట్టుబడిన నిందితులపై పోలీసులు పిడి( ప్రివెన్షన్ డిటెక్షన్) యాక్ట్ నమోదుచేశారు. వారిపై ఈ యాక్టు ఉయోగిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. 

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన ఓ గర్భిణిని హత్యకు గురైన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గర్భిణి మృతదేహాన్ని నిందితులు అత్యంత పాశవికంగా కట్టర్ల సాయంతో నరికి ఆ ముక్కలుగా గన్ని సంచుల్లో నింపి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు. దీన్ని
గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మర్డర్ మిస్టరీని చేదించడానికి సైబరాబాద్ పోలీసులు చాలా కష్టపపడాల్సి వచ్చింది. చివరికి మృతురాలిని రాజస్థాన్  మహిళగా గుర్తించిన పోలీసులు ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణంగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో నిందితులైన మమతా ఝా(36), అనిల్ ఝా(38), అమర్ కాంత్ ఝా(24), వికాస్ కశ్యప్(32) లపై తాజాగా  పీడి యాక్టు నమోదు చేసినట్లు సైబరాబాద్ కమీషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. ఇలా అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన నిందితులను సమాజానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతోనే పిడి యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 

click me!