హైద్రాబాద్‌ పాతబస్తీలో ఎన్ఐఏ తనిఖీలు: ఇద్దరి అరెస్ట్

First Published Aug 6, 2018, 5:15 PM IST
Highlights

హైద్రాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదులు  తలదాచుకొన్నట్టుగా సమాచారం రావడంతో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి

హైదరాబాద్: హైద్రాబాద్ పాతబస్తీలో ఉగ్రవాదులు  తలదాచుకొన్నట్టుగా సమాచారం రావడంతో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.అనుమానితుల ఇళ్లలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఐసీస్ కేసుల్లో అనుమానితులుగా ఉన్న  ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ పాతబస్తీలోని  పహడీ షరీఫ్, షాహీన్ నగర్‌లలో ఎన్ఐఏ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

వరంగల్‌కు ఖుద్దూస్  అనే వ్యక్తి  హైద్రాబాద్‌లో  తలదాచుకొంటున్నారని ఎన్ఐఏకు సమాచారం అందింది.ఈ సమాచారం ఆధారంగా ఎన్ఐఏ గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని ఓ అరెస్టైన రహమాన్   ఓ అనుమానితుడు ఇచ్చిన సమాచారం మేరకు  ఎన్ఐఏ  బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

ఢిల్లీలో రహమాన్  ఇచ్చిన సమాచారం మేరకు  ఇద్దరిని  ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారని సమాచారం. అయితే  దేశంలో అశాంతి సృష్టించేందుకు భారీగా ఉగ్రవాదులు ప్రవేశించారని ఇంటలిజెన్స్ అధికారులు రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.  

ఈ తరుణంలో హైద్రాబాద్ పాతబస్తీలో  ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. మూడు రాష్ట్రాలకు చెందిన ఎన్ఐఏ బృందాలు  ఈ సోదాల్లో పాల్గొన్నాయి.ఈ సోదాలకు రాచకొండ పోలీసులు సహకరించారు. 

click me!