
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందా, లేదా అనే విషయాన్ని ఆయన ఇప్పటి వరకు కూడా తేల్చలేదు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నిక కమిషన్ ప్రకటించింది.
ఈ స్థితిలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్ కల్యాణ్ జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందించారు. తెలంగాణల ఎన్నికల్లో పోటీ చేసేది, లేనిదీ ఓ వారం రోజుల్లో తెలియజేస్తానని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై పవన్ కల్యాణ్ ప్రధానంగా దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన గతంలో ఒకటి, రెండు సార్లు చెప్పారు. అయితే, ఎన్నికల సమీపిస్తున్నప్పటికీ తెలంగాణలో పోటీ చేస్తారా, లేదా అనే విషయాన్ని తేల్చలేదు.