కేసీఆర్‌పై బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు...10వ తేదీ తర్వాత మరింత...

By Arun Kumar PFirst Published Oct 8, 2018, 4:40 PM IST
Highlights

తెలగాణ అసెంబ్లీ రద్దు తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ గూటికి చేరతారో...ఎవరిపై ఎవరు విమర్శలు చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత బాబుమోహన్ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. 

కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న బాబుమోహన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నియంత సీఎంను తాను ఇదివరకెప్పుడూ చూడలేదని విమర్శించారు.  ఫాంహౌస్‌లో ముసుగేసుకుని పాలన సాగించిన ఏకైక సీఎం కేసీఆరే అంటూ బాబుమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

అయితే ఈ విమర్శలు మరింత పెంచుతానంటూ బాబుమోహన్ హెచ్చరించారు. కానీ ఇప్పటినుండి కాకుండా ఈ నెల 10వ తారీఖు నుండి తన మాటలు, విమర్శలు, ఆరోపణల ఘాటు పెంచుతానని అన్నారు. తనన చులకనగా చూసిన కేసీఆర్ కు తన ప్రతాపమేంటో చూపించి దిమ్మతిరిగేలా సమాధానం చెబుతానని బాబుమోహన్ హెచ్చరించారు.

గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా వున్న బాబుమోహన్‌కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించక పోవడంతో అమిత్ సమక్షంలో బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత ఆయన పలు సందర్భాల్లో తనను పనికిరాని వాడిగా భావించిన కేసీఆర్ కు తగిన విధంగా సమాధానం చెబుతానని పేర్కొన్నాడు. కానీ ఇంత ఘాటుగా ఎప్పుడూ విమర్శించలేదు. ఇప్పుడే ఇలా ఉంటే తాను ప్రకటించినట్లు 10 వ తేదీ తర్వాత బాబుమోహన్ విమర్శలు ఏ రేంజ్ లో ఉంటాయో అని అటు ప్రజల్లోను ఇటు రాజకీయ నాయకుల్లోను చర్చ జరుగుతోంది.  

click me!