తెలంగాణలో ఎన్నికలపై పాట: సిఈవోను కలిసి గద్దర్ వినతి

By Nagaraju TFirst Published Oct 8, 2018, 4:40 PM IST
Highlights

ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనుకు అనుమతినివ్వాలంటూ కోరారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యానికి ఓటు ఒక జీవననాడి అని తెలిపేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని రజత్ కుమార్ కు తెలిపారు. 

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ ను కలిశారు. ముందస్తు ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తనుకు అనుమతినివ్వాలంటూ కోరారు. ఓటు హక్కు వినియోగం, ప్రజాస్వామ్యానికి ఓటు ఒక జీవననాడి అని తెలిపేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని రజత్ కుమార్ కు తెలిపారు. 

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రక్షించుకుందాం అన్న నినాదంతో రెండేళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ప్రచారం చేశానని తెలిపారు. ప్రజల పాట మాట ఆట ద్వారా రాజ్యాంగ ప్రియాంబుల్స్ ను గుండెకద్దుకుని ప్రచారం చేశానన్నారు. 

తానొక గాయపడ్డ ప్రజల పాటనన్న గద్దర్ తనకు గతంలో 2 ప్లస్ 2 సెక్యూరిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. తాను చేపట్టబోయే ప్రచారానికి అనుమతినిస్తూ సహాయ సహకారాలు అందించాలని గద్దర్ పాటరూపంలో కోరారు.

                                            

 

click me!