ఉర్జిత్ పటేల్ పై ఉరిమిన పవన్

Published : Dec 20, 2016, 12:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఉర్జిత్ పటేల్ పై ఉరిమిన పవన్

సారాంశం

నోట్ల రద్దు పై ట్విటర్ లో స్పందించిన జనసేన అధిపతి

 

ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ట్విటర్ లో విరుచకపడ్డారు.

 

పెద్ద నోట్ల రద్దు అనే తేనేతుట్టెను కదిపిన  ఉర్జిత్ పటేల్ దేశంలో సామాన్యుల సమస్యలు గమనించారా అంటూ సూటిగా ప్రశ్నించారు.

 

కర్నులు బాలరాజుతో సహా దేశంలో అనేక మంది చనిపోడానికి నోట్ల రద్దు అనే అనాలోచిత నిర్ణయమే కారణమని ధ్వజమెత్తారు.

 

సామాన్యులంతా చిల్లర కోసం బ్యాంకు క్యూలో నిలబడి చనిపోతుంటే ధనవంతుల ఇళ్లకు నేరుగా కొత్త నోట్లు వస్తున్నాయని విమర్శించారు.

 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లు అయినా ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఇంకా చేతులతోనే మలాన్ని శుభ్రం చేస్తున్నారు. ఈ సమస్యనే ఇంకా రూపుమాపలేని ప్రభుత్వం ఇప్పుడు క్యాష్ లెస్ ఎకానమీ అంటూ ప్రజలను భ్రమల్లో ముంచుతుందోని పేర్కొన్నారు.

 

దేశంలో సామాన్యులంతా నోట్ల రద్దుతో అల్లాడుతుంటే మీరు... మీ అధినేతలు గాఢంగా నిద్రపోండి అంటూ ఉర్జిత్ పటేల్ కు చురకలంటించారు.

PREV
click me!

Recommended Stories

మనల్ని ఎవర్రా ఆపేది.. తెలంగాణలో తిరుగుతాం..పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Latest Speech| Asianet Telugu
తెలంగాణ రాజకీయాల్లో దడ పుట్టించే పవన్ ఫైర్ స్పీచ్ | Pawan Kalyan Pressmeet | Asianet News Telugu