ఎన్నికలకు వారం రోజుల ముందు పొత్తులపై స్పష్టత వస్తుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తులు కుదిరితే కలిసి వెళ్తామన్నారు. లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.
హైదరాబాద్: ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. అనంతపరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో పొత్తులపై వారం రోజుల ముందు స్పష్టత వస్తుందన్నారు. కొత్త పొత్లులు కలిస్తే కొత్త వారితో కలిసి వెళ్తామన్నారు. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. 2014 కాంబినేషన్ ను కాలమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.
. పొత్తులపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయన్నారు. ఓట్లు చీలకుండా ఉండాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు.తమ పార్టీకి బీజేపీ మధ్య మైత్రి ఉందని చెప్పారు. కొత్త పొత్తులు కుదిరితే కలిసి పోటీ చేస్తామన్నారు. లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
undefined
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉన్నారన్నారు. ఆయనంటే తనకు అపరిమితమైన గౌరవం ఉందన్నారు. తమ మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు.
also read:కొండగట్టులో పవన్ కళ్యాణ్: వారాహి వాహనానికి జనసేనాని ప్రత్యేక పూజలు
జనసేనలో కన్నా లక్ష్మీనారాయణ చేరుతున్నారా అనే విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. ఎక్కువ పార్టీలు రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. రాజకీయాల్లో కూడా మార్పు అవసరమన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటును ఆయన స్వాగతించారు.తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర గురించి కాలం చెబుతుందన్నారు.