తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు , జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తెలంగాణ సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ భవన్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ కూడా హాజరు కానున్నారు.
మరో వైపు జేడీయూ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు లలన్ సింగ్ , బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లు హజరౌతారని ప్రభుత్వం ప్రకటించింది. సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు ఇతర నేతలు కూడా హాజరు కానున్నారు.ఈ నెల 17వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభోత్సవానికి ముందు వాస్తు పూజ, సుదర్శనయాగం, చండీయాగం నిర్వహించనున్నారు.
తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. భూమి పూజ చేసిన సమయంలో ఈ నిర్మాణ పనులను 9 మాసాల్లో పూర్తి చేయాలని తొలుత భావించారు. అయితే కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి.
గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడ పనులు పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. భూమి పూజ చేసిన సమయంలో ఈ నిర్మాణ పనులను 9 మాసాల్లో పూర్తి చేయాలని తొలుత భావించారు. అయితే కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడ పనులు పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
also read:10 రోజుల్లో పనులను పూర్తి చేయాలి: సచివాలయ పనులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష
కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.