
టాలీవుడ్అ గ్రకథానాయకులు ఏమైంది. ఒక వైపు వేల కోట్ల పారితోషకాలు.. మరో వైపు జీరో బ్యాలెన్స్లో బ్యాంకు అకౌంట్లు.. తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీకు తలపోటు ఖాయం.. ఇంతకీ ఈ సోది అంతా ఏందుకంటే..
జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాంకుకు వచ్చారు. తన దగ్గర ఉన్న పెద్ద నోట్లను డిపాజిట్ చేయడానికి... అసలే పవర్ స్టార్.. కోట్లల్లో పారితోషం తీసుకుంటాడు కదా.. డిపాజిట్ కూడా కోట్ల లోనే చేసుంటాడు అనుకుంటున్నారా.. మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
పాపం పవర్ స్టార్ సింపుల్ గా బ్యాంకు వచ్చి తన దగ్గర ఉన్న కేవలం నాలుగంటే నాలుగు వేలను మాత్రమే డిపాటిజ్ చేశారు.అక్కడే ఫాంలో నిబంధనల ప్రకారం అన్ని వివరాలు స్వయంగా రాసి తన దగ్గర ఉన్న నాలుగు వేల రూపాయిలను డిపాజిట్ చేశారు. అక్కడే క్లిక్ మనిపించిన ఫోటో ఇది.
పవర్ స్టార్ తమ బ్యాంకు కు రావడంతో అక్కడి ఉద్యోగులు, బ్యాంకుకు వచ్చిన వారు ఆయనతో ఫొటో దిగడానికి ఎగబడ్డారు. అయితే పవన్ తన పని ముగియగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.