కేసీఆర్‌ కేబినెట్‌లోకి పట్నం మహేందర్ రెడ్డి: ప్రమాణం చేయించిన గవర్నర్

By narsimha lode  |  First Published Aug 24, 2023, 3:39 PM IST

తెలంగాణ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేశారు.


హైదరాబాద్: కేీసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డి వచ్చారు.  తెలంగాణ మంత్రిగా  పట్నం మహేందర్ రెడ్డి గురువారంనాడు రాజ్ భవన్ లో  ప్రమాణం  చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.1994 నుండి తాండూరు అసెంబ్లీ స్థానం నుండి పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 1994 నుండి 2009 వరకు  టీడీపీ అభ్యర్ధిగా  తాండూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల ముందు పట్నం మహేందర్ రెడ్డి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  విజయం సాధించారు.  

కేసీఆర్ మంత్రి వర్గంలో  పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 ఎన్నికల్లో  మరోసారి  తాండూరు నుండి  పట్నంమహేందర్ రెడ్డి  బీఆర్ఎస్  అభ్యర్ధిగా  పోటీ చేశారు.

Latest Videos

undefined

 కానీ  కాంగ్రెస్ అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.   ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్గికి బీఆర్ఎస్ నాయకత్వం   ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.  తాండూరు నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య  ఘర్షణ వాతావరణం ఉండేది.  రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య  బహిరంగంగానే  తోపులాట, విమర్శలు చేసుకున్న ఘటనలు కూడ జరిగాయి. ఇరువురి నేతల మధ్య  రాజీకి పార్టీ నాయకత్వం ప్రయత్నించింది. కానీ  ఎవరూ కూడ బెట్టు వీడలేదు.

ఈ నెల  21న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.  అయితే  తాండూరు నుండి  పోటీ చేయాలని  పట్నం మహేందర్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఈ తరుణంలో  మహేందర్ రెడ్డిని  బీఆర్ఎస్ నాయకత్వం బుజ్జగించింది.  మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది.  దీంతో  తాండూరు నుండి పోటీ  విషయంలో మహేందర్ రెడ్డి వెనక్కు తగ్గారు.  మహేందర్ రెడ్డి సోదరుడు  పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది.ఇచ్చిన హామీ మేరకు  మహేందర్ రెడ్డికి తన మంత్రివర్గంలోకి కేసీఆర్ చోటు కల్పించారు.

click me!