గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి షాక్: అనర్హత వేటేసిన తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Aug 24, 2023, 3:13 PM IST

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై  అనర్హత వేటేసింది తెలంగాణ హైకోర్టు.


హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా  ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.మాజీ మంత్రి డీకే అరుణను  ఎమ్మెల్యేగా  ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. 2018 ఎన్నికల సమయంలో  తప్పుడు అఫిడవిట్ సమర్పించారని  బండ కృష్ణ మోహన్ రెడ్డిపై   తెలంగాణ హైకోర్టులో  పిటిషన్  దాఖలైంది..ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు  గురువారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.  గద్వాల ఎమ్మెల్యేగా  డీకే అరుణను ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.  అంతేకాదు  బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.  

2018 ఎన్నికల్లో  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై  బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు. కృష్ణ మోహన్ రెడ్డి, డీకే అరుణ ల మధ్య బంధుత్వం ఉంది.

Latest Videos

undefined

గతంలో కృష్ణ మోహన్ రెడ్డి టీడీపీలో ఉండేవారు.  2014 ఎన్నికలకు ముందు కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.   2014లో గద్వాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా  పోటీ చేసి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డీకే అరుణ చేతిలో ఓటమి పాలయ్యారు.2018 ఎన్నికల్లో  మరోసారి బండ కృష్ణమోహన్ రెడ్డి  గద్వాల నుండి పోటీ చేశారు. మాజీ మంత్రి డీకే అరుణపై  బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం సాధించారు.

ఈ ఏడాది జూలై  25న  కొత్తగూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావును అనర్హుడిగా  ప్రకటించింది తెలంగాణ హైకోర్టు.  తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు  సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు  స్టే విధించింది.అయితే  గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడ తెలంగాణ హైకోర్టు తీర్పుపై  సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
 

 

 

click me!