అది టెక్నికల్ ప్రాబ్లమ్.. మా తప్పు కాదు: నామినేషన్ తిరస్కరణపై పారేపల్లి శేఖర్

Siva Kodati |  
Published : Oct 01, 2019, 08:42 PM IST
అది టెక్నికల్ ప్రాబ్లమ్.. మా తప్పు కాదు: నామినేషన్ తిరస్కరణపై పారేపల్లి శేఖర్

సారాంశం

హుజూర్‌నగర్ ఉపఎన్నక సందర్భంగా తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంపై సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ స్పందించారు.

హుజూర్‌నగర్ ఉపఎన్నక సందర్భంగా తన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంపై సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ స్పందించారు. న్నికల కమీషన్ వెబ్ సైట్  నుండి డౌన్ లోడ్ చేసిన పత్రం లో నామినేషన్ దాఖలు చేశామని ఆయన తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కొత్తగా చేరిన కాలమ్ వెబ్ సైట్ లో అప్డేట్ కాలేదన్నారు. కేవలం రిటర్నింగ్ అధికారి వద్ద నేరుగా తీసుకున్న పత్రాల లో మాత్రమే ఆ కాలమ్ ఉందని శేఖర్ పేర్కొన్నారు.

అధికారిక వెబ్ సైట్ లో పెట్టకుండా మా నామినేషన్ తిరస్కరించడం సరికాదని ఆయన మండిపడ్దారు. న్యాయనిపుణుల తో సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని శేఖర్ స్పష్టం చేశారు,. 

"

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ