జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు వద్దన్న సీబీఐ

By Siva KodatiFirst Published Oct 1, 2019, 8:15 PM IST
Highlights

వ్యక్తిగత హాజరు మినహాంపుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహాన్‌ రెడ్డి వేసిన పిటిషన్  పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ సీబీఐ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. 

వ్యక్తిగత హాజరు మినహాంపుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహాన్‌ రెడ్డి వేసిన పిటిషన్  పై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ సీబీఐ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కౌంటర్‌లో పేర్కొంది.  

వాస్తవాలను దాచిపెట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని..  జగన్‌ జైళ్లో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేశారని సీబీఐ గుర్తు చేసింది. అలాంటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్‌ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయపడింది.

ఏపీ లో రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరు మినహాయింపునిచ్చే కారణం కాదని.. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టం కాదని కౌంటర్ లో పేర్కొంది. దీనిపై న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విననుంది. 

click me!