హైదరాబాద్‌లో ఎల్‌కేజీ స్కూల్ ఫీజు రూ. 4 లక్షలా?

By Mahesh K  |  First Published Feb 15, 2024, 3:25 PM IST

హైదరాబాద్‌లో స్కూళ్లు పేరెంట్స్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. ఎల్‌కేజీ బుడతడికి కూడా నాలుగు లక్ష రూపాయల ఫీజును అడుగుతున్నాయి. పిల్లల ఫీజులతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.
 


School Fees: నేడు స్థిరాస్తులు, చరాస్తుల కంటే కూడా పిల్లల చదువుల కోసం మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఆరాటపడుతున్నాయి. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను ది బెస్ట్ స్కూల్స్‌లో చదివించాలని తాపత్రయపడుతున్నాయి. వారి ఫీజుల కోసం ఎంతో శ్రమిస్తుంటాయి. హైదరాబాద్‌ నగరం దీనికి మినహాయింపేమీ కాదు. కానీ, ఇక్కడ స్కూల్ ఫీజులు చూసి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఎల్‌కేజీకి స్కూల్ ఫీజు 4 లక్షలు చెల్లించాలని చెప్పడంతో గుండె జారిపోయినంత పని అవుతున్నది. ఈ విషయంపై ఓ పేరెంట్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయగా.. చాలా మంది తల్లిదండ్రులు ఈ సమస్యతో రిలేట్ అయ్యారు.

నర్సరీ నుంచి ఎల్‌కేజీలోకి వెళ్లే పిల్లలకు స్కూల్ ఫీజును ఈ ఏడాది 65 శాతం పెంచారని ఓ వ్యక్తి చెప్పారు. బాచుపల్లిలోని ఓ ప్రముఖ స్కూల్‌లో ఫీజు రూ. 2.3 లక్షల నుంచి రూ. 3.7 లక్షల వరకు ఉంటుందని ఆ పేరెంట్ వివరించారు.

Latest Videos

undefined

ఈ ఫీజు పెంపునూ ఆ స్కూల్ సమర్థించుకోవడం గమనార్హం. తమ స్కూల్ ఇప్పుడు ఐబీ కర్రికులం అడాప్ట్ చేసుకుంటున్నదని, కాబట్టి, ఈ ఫీజుపై చర్చ అనవసరం అని స్కూల్ యాజమాన్యం సమర్థించుకున్నట్టు ఆ పేరెంట్స్ తెలిపారు.

‘మేం మా అబ్బాయిని ఎన్రోల్ చేసినప్పుడు ఫీజు స్ట్రక్చర్ 1వ తరతగతి వరకైనా మారదని అనుకున్నాం. కానీ, నర్సరీ నుంచి ఎల్‌కేజీలోకి అడుగు పెట్టడానికి స్కూల్ యాజమాన్యం ఫీజులో 70 శాతం పెంపు చేసింది’ అని ఒకరు తెలిపారు. కాగా, తమ పెద్ద కొడుకు నాలుగో తరగతి ఇదే స్కూల్లో చదువుతున్నాడని, వాడికి ఫీజు రూ. 3.2 లక్షలని చిన్నవాడి కంటే రూ. 50 వేలు తక్కువే అని వివరించారు. తాము స్కూల్ మార్చాలని భావించినా.. ఇంత స్వల్ప సమయంలో స్కూల్‌లో అడ్మిషన్లు దొరకడం కష్టతరంగా మారిందని తెలిపారు. ఈ పోస్టు వైరల్ అయింది.

Also Read: BJP: ఏడుగురు కేంద్రమంత్రులను రాజ్యసభకు తీసుకోవడం లేదు.. బీజేపీలో ఏం జరుగుతున్నది?

మరో పేరెంట్ రియాక్ట్ అవుతూ.. తల్లిదండ్రులు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషణ్ పై లక్షలు వెచ్చించాలంటే ఆందోళనకు గురవడం సహజమేనని, కానీ, ఒకటో తరగతి, ఆ పై తరగతులకు అడ్మిషన్లు దొరకడం లేదు.. మరీ ముఖ్యంగా ఐబీ, కేంబ్రిడ్జీ స్కూళ్లలో అసలే దొరకడం లేవని వివరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎల్‌కేజీకి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తున్నదని వాపోయారు.

మరొకరు తన బాధను పంచుకుంటూ తన కొడుకును ఒకటో తరగతిలో చేర్చడానికి కూకట్‌పల్లిలో పది స్కూళ్లు తిరిగానని, అందులో ఫీజులు ఒక లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఫీజు ఉన్నదని వివరించారు. వారంతా.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్‌లను చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లలో అకాడమిక్స్‌తోపాటు ఎక్స్‌ట్రా కర్రికులర్ యాక్టివిటీస్ పై ఫోకస్ ఉండాలి గానీ.. ఈ పెద్ద పెద్ద భవంతులపై ఫోకస్ అనవసరం అని అభిప్రాయపడ్డారు.

కాగా, స్కూల్ యాజమాన్యం మాత్రం ఫీజుల పెంపును సమర్థించుకుంటున్నాయి. మార్కెట్‌లో అన్నింటికి ధరలు పెరుగుతున్నాయని, నైపుణ్యవంతమైన ఉపాధ్యాయులను కాపాడుకోవాలంటే తప్పక పెద్ద మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తున్నదని చెబుతున్నాయి.

click me!