భార్యభర్తల మధ్య గొడవ.. రోజుల పసికందు మృతి..!

Published : Sep 25, 2021, 07:24 AM IST
భార్యభర్తల మధ్య గొడవ.. రోజుల పసికందు మృతి..!

సారాంశం

ఆ సమయంలో బిడ్డ తల్లి ఒడిలో ఉన్నాడు. రాజు భార్యపై దాడి చేయగా... ఆమె శిశువును అడ్డంగా పెట్టింది. ఇద్దరి పెనుగులాటలో చిన్నారి ఊపిరి ఆగిపోయింది


మద్యం మత్తులో దంపతులు గొడవ పడ్డారు. ఈ క్రమంలో.. వారి మధ్య జరిగిన పెనుగులాటలో వారి 22 రోజుల బిడ్డ కన్నుమూసింది. గతంలో వారి పెద్ద కుమారుడు ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తాగిన మైకంలో ఆ పసివాడిని బయటకు విసిరేశారు. ఇప్పుడు రోజుల పసిబిడ్డ ప్రాణాలు కూడా తీసేశారు ఈ సంఘటన సైదాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సైదాబాద్ డివిజన్ పూసలబస్తీ పరిధి క్రాంతినగర్ బస్తీకి చెందిన పొదిల రాజేష్ అలియాస్ రాజు(36), జాహ్నవి(25) దంపతులు. రాజేష్ వాచ్ మన్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఇపపటికే ఒక కుమారుడు ఉండగా.. 22 రోజుల కిందట జాహ్నవి రెండో మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం దంపతలిద్దరూ మద్యం తాగి, మత్తులో గొడవకు దిగారు.

ఆ సమయంలో బిడ్డ తల్లి ఒడిలో ఉన్నాడు. రాజు భార్యపై దాడి చేయగా... ఆమె శిశువును అడ్డంగా పెట్టింది. ఇద్దరి పెనుగులాటలో చిన్నారి ఊపిరి ఆగిపోయింది, స్థానికుల సహకారంతో వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించినా ప్రాణం దక్కకపోవడం బాధాకరం. రెండేళ్ల వయసులో తమ పెద్ద కుమారుడిని కూడా ఈ దంపతులు మద్యం మత్తులో బయటకు విసిరేశారు. అప్పట్లో పోలీసులు జోక్యం చేసుకొని.. ఆ బాలుడిని యూసుఫ్ గూడలోని శిశు విహార్ కు తరలించారు.  ఆ బాలుడు ఇప్పటికీ అక్కడే పెరుగుతున్నాడు. ఇప్పుడు రెండో కుమారుడు భార్యభర్తల మత్తుకు బలయ్యాడని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?