24 గంటల్లో 239 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,64,650కి చేరిన కరోనా కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 24, 2021, 09:47 PM ISTUpdated : Sep 24, 2021, 09:50 PM IST
24 గంటల్లో 239 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,64,650కి చేరిన కరోనా కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 239 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతి చెందారు. 336 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,778 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,569 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 239 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 6,64,650కి చేరింది. 24 గంటల వ్యవధిలో వైరస్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 3,911కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 336 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,55,961కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 4,778 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 10, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 17, ఖమ్మం 8, మహబూబ్‌నగర్ 3, ఆసిఫాబాద్ 2, మహబూబాబాద్ 2, మంచిర్యాల 6, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 10, ములుగు 1, నాగర్ కర్నూల్ 3, నల్గగొండ 16, నారాయణపేట 0, నిర్మల్ 0, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 8, సిరిసిల్ల 5, రంగారెడ్డి 16, సిద్దిపేట 5, సంగారెడ్డి 3, సూర్యాపేట 7, వికారాబాద్ 2, వనపర్తి 3, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్ 12, యాదాద్రి భువనగిరిలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్