తెలంగాణ: అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!!

Siva Kodati |  
Published : Sep 24, 2021, 08:10 PM ISTUpdated : Sep 24, 2021, 08:13 PM IST
తెలంగాణ: అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. షెడ్యూల్ ఇదే..!!

సారాంశం

అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.

అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు వుంటాయని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. పరీక్షా  విధానంలో ఎలాంటి మార్పు వుండదని.. గతంలో మాదిరే పరీక్షలు  వుంటాయని వెల్లడించింది.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లు వుంటాయని .. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందికే పరీక్షల విధులు అప్పగిస్తామని వెల్లడించింది. 

పరీక్షల షెడ్యూల్:

  • అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్
  • అక్టోబర్ 26న ఇంగ్లీష్
  • అక్టోబర్ 27న గణితం, పొలిటికల్ సైన్స్
  • అక్టోబర్ 28న గణితం, హిస్టరీ
  • అక్టోబర్ 29న ఫిజిక్స్, ఎకనామిక్స్
  • అక్టోబర్ 30న కెమిస్ట్రీ, కామర్స్
     

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?