మండల కమిటీల నియామకాల్లో అన్యాయం:గాంధీ భవన్‌ ముందు పాల్వాయి వర్గం ధర్నా

By narsimha lode  |  First Published Jul 6, 2023, 5:18 PM IST

మండల కమిటీల్లో తమ వర్గం నేతలకు  ప్రాధాన్యత లేదని  మునుగోడు నియోజకవర్గంలోని పాల్వాయి స్రవంతి వర్గం నేతలు ఆందోళనకు దిగారు.


హైదరాబాద్: గాంధీ భవన్ లో  కాంగ్రెస్ పార్టీకి  చెందిన మునుగోడు నేతలు ఆందోళనకు దిగారు.  మండల కమిటీల నియామకాల్లో తమకు  అన్యాయం జరిగిందని  పాల్వాయి స్రవంతి వర్గం గుర్రుగా ఉంది. తమ వర్గానికి చెందిన నేతలతో  పాల్వాయి స్రవంతి  గురువారంనాడు గాంధీ భవన్ కు  వచ్చారు.   గాంధీ భవన్ లో  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  క్యాబిన్ లోకి  వెళ్లేందుకు   ప్రయత్నిస్తే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.   దీంతో  గాంధీభవన్   ముందు  ఆందోళనకు దిగారు. తమకు జరిగిన అన్యాయంపై  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు  చేశారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మండల కమిటీల అధ్యక్షుల నియామకంలో  చలిమెల  కృష్ణారెడ్డి వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని పాల్వాయి స్రవంతి రెడ్డి  ఆరోపించారు. మండల కమిటీల్లో తమ వర్గానికి చెందిన నేతలకు  ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎలా పనిచేయాలని  స్రవంతి రెడ్డి రేవంత్ రెడ్డిని కోరారు.   తమకు న్యాయం చేయాలని  ఆమె కోరారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి  చెందిన వ్యక్తిగా చలిమెల కృష్ణారెడ్డికి పేరుంది.  

Latest Videos

గత ఏడాదిలో జరిగిన మునుగోడు అసెంబ్లీ టిక్కెట్టును  చలిమెల కృష్ణారెడ్డి  ఆశించారు.  కానీ పార్టీ సీనియర్లు పాల్వాయి స్రవంతి వైపే మొగ్గు చూపారు.  దీంతో  పాల్వాయి స్రవంతికే   పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి  పరిమితమైంది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి  పాల్వాయి స్రవంతి  తండ్రి పాల్వాయి  గోవర్థన్ రెడ్డి పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు.  కానీ ,  ఈ నియోజకవర్గం నుండి పాల్వాయి స్రవంతి రెడ్డి  రెండు దఫాలు పోటీ చేసినా   విజయం దక్కలేదు.

click me!