ఈ పాలమూరు టిఆర్ఎస్ లీడర్ చిల్లర పని (వీడియో)

Published : Feb 23, 2018, 06:41 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఈ పాలమూరు టిఆర్ఎస్ లీడర్ చిల్లర పని (వీడియో)

సారాంశం

మంచినీళ్ల కోసం వచ్చి చిల్లర పని సిసి టివిలో రికార్డు అయిన లీడర్ బాగోతం సోషల్ మీడియాలో వైరల్

ఆయన పాలమూరు జిల్లాలో ఒక టిఆర్ఎస్ లీడర్. ఆయన చేసిన ఒక చిల్లర పని సిసి టివిలో రికార్డైంది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ పనేందంటే? పాలమూరు జిల్లాలోని ఘణపూర్ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నేత వేముల కుమార్ గౌడ్ మంచినీటి ప్లాంట్ వద్దకు నీళ్లు నింపుకునేందుకు వచ్చిండు. క్యాండి వాటర్ ప్లాంట్ లో
వాటర్ తిసుకోవాడానికి వచ్చిన ఆ లీడర్ అటు ఇటూ చూసిండు. ఎవరూ లేరనుకుని అక్కడే ఉన్న కరెంట్ బల్బ్ ( లైట్ బుగ్గ ) దొంగతనం చేశాడు. ఆ బుగ్గను జేబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సేఫ్ గా బుగ్గను దొంగిలించానునుకున్నాడు ఆ లీడర్. కానీ అక్కడ సిసి కెమెరాలో ఆయన బాగోతం అంతా రికార్డయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పెద్దరికం చూపాల్సిన అధికార పార్టీ నేతకు ఇదేం చిల్లర బుద్ధి అని జనాలు చర్చించుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Exam Tips : ఎగ్జామ్స్ కు ముందు టెన్షన్ తగ్గించుకునే... టాప్ 5 గోల్డెన్ టిప్స్
Rain Alert : నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తెలుగు జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే