తెలంగాణ పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం

First Published Feb 22, 2018, 8:26 PM IST
Highlights
  • తన భర్త మీద ఏకంగా డిజిపి కే ఫిర్యాదు చేసిన సతీమణి
  • తనకు విడాకులివ్వకుండానే వేరే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు ఆరోపణ
  • 5లక్షలు ఇస్తా రాజీ పడాలని వేధిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ పోలీసు శాఖలో అక్రమ సంబంధాల గుట్టు ఒక్కొక్కటిగా రట్టు అవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుని రెచ్చపోతున్నారు. ఇందరు శాఖలోని వారిని వలలో వేసుకుని అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. గడిచిన ఆరు నెలల కాలంలో తెలంగాణ పోలీసు శాఖ అక్రమ సంబంధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇప్పటికే అవినీతి, అక్రమాలు, బంధు ప్రీతి, నేతల అడుగులకు మడుగులొత్తడం.. లాంటి నీచమైన పనుల్లో మెజార్టీ పోలీసు శాఖ నిమగ్నమైన వేళ.. ఇప్పుడు కొత్తగా అక్రమ సంబంధాలు నడుపుతూ.. ఉన్న కాస్తో కూస్తో పరువును సైతం బజారున పడేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇటీవల ఎసిబి అడిషనల్ ఎస్సీ సునీతారెడ్డి తన కింద పనిచేసే సిఐ మల్లిఖార్జునరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుని సస్పెండైన వివాదం మరవకముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది.

తాజాగా పోలీస్ శాఖలో మరో అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. (CAR) అడిషనల్ డీసీపీ కె. బాబు రావు పై ఆయన భార్య వేదశ్రీ ఇవాళ ఏకంగా డిజిపి కే ఫిర్యాదు చేసింది. తనతో 25 ఏళ్ళు కాపురం చేసి నలుగురు పిల్లలకు తండ్రి అయిన తరువాత తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె డిజిపికి చేసిన ఫిర్యాదులో పేర్కన్నది.
మతం మార్చుకొని తనకు విడాకులు ఇవ్వకుండానే సహజీవనం చేస్తున్నట్లు డీసీపీ బాబురావు సతీమణి ఆరోపిస్తోంది. గతంలో సౌత్ జోన్ ఆడిషన్ డీసీపీ గా పనిచేసినప్పుడు చాలామంది తో అక్రమ సంబంధాలు ఉన్నాయని భార్య ఆరోపించారు.
5 లక్షలు ఇస్తాను విడాకులు ఇవ్వాలని బాబూరావు తన మీద వత్తిడి చేస్తున్నట్లు ఆమె ఆరోపిస్తున్నారు. పోలీస్ శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న బాబురావు పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డికి వేదశ్రీ రెండు పేజీల లేఖను రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు.

 

click me!