Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బైకును ఢీ కొట్టిన కారు, ఇద్ద‌రు స్పాట్ డెడ్

By Mahesh Rajamoni  |  First Published Aug 22, 2023, 4:54 AM IST

Hyderabad: హైద‌రాబాద్ లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ వద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ రహదారిపై ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది.
 


Pahadishareef Road Accident: హైద‌రాబాద్ లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పహాడీషరీఫ్ వద్ద జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదంలో ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ రహదారిపై ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది.

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ రోడ్డులో ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వస్తున్న సమయంలో అతివేగంతో వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. వీరిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Latest Videos

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు. 

ఇదిలావుండ‌గా, అంత‌కుముందు నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం అనాజీపురం వద్ద సోమవారం తెల్లవారుజామున ద్విచక్రవాహనాన్ని ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. బస్సు టైర్‌ ఒకటి పగిలిపోవడంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయి మోటార్‌ బైక్‌ను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ పొలంలో దూసూకెళ్లింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

కాగా, శనివారం లడఖ్‌లోని లేహ్‌లో జరిగిన ట్రక్కు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక సైనికుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. భారత ఆర్మీ కాన్వాయ్‌లోని ట్రక్కు లోయలో పడిన దురదృష్టకర సంఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొద్దర్గు మండలం తిర్మంగోడుపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శేఖర్ ఒకరు.
 

click me!