తెలంగాణలో మోడల్ కోడ్‌ను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌.. ఎందుకంటే..?

By Mahesh Rajamoni  |  First Published Aug 22, 2023, 1:10 AM IST

Hyderabad: తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు జీ. నిరంజన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. అభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
 


Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌ధాన రాజ‌కీయ‌ పార్టీలైన భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ లు వ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల పోటీలో మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌) వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని కోరింది.

తెలంగాణలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షుడు జీ. నిరంజన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. అభ్యర్థుల ప్రకటనతో బీఆర్‌ఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమవారం 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కేవలం ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టిక్కెట్లు నిరాకరించారు. మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను 3-4 రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

Latest Videos

undefined

గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018లో గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, ఈ రెండు చోట్లా కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గజ్వేల్ ను నిలబెట్టుకుంటామనే నమ్మకం కేసీఆర్ కు లేనందున కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను ఓడిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గంప గోవర్ధన్ చేతిలో 5,007 ఓట్ల తేడాతో ఓడిపోయిన షబ్బీర్ ను పార్టీ మళ్లీ బరిలోకి దింపే అవకాశం ఉంది. గ‌జ్వేల్ ఒట‌మి భ‌యంతోనే సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని విమ‌ర్శించారు. అయితే, రెండు చోట్ల ఘోర ప‌రాభవం త‌ప్ప‌ద‌ని అన్నారు. కామారెడ్డి స్థానాన్ని భారీ మెజారిటీతో గెలుచుకుంటామ‌ని ష‌బ్బీర్ అలీ తెలిపారు. కాగా, 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

click me!