కేసీఆర్ బర్త్ డే : బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారు చీర

Published : Feb 17, 2021, 10:21 AM IST
కేసీఆర్ బర్త్ డే : బల్కంపేట ఎల్లమ్మకు రెండున్నర కిలోల బంగారు చీర

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 67వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బల్కంపేట ఆలయంలోని ఎల్లమ్మ తల్లికి రెండున్నర కిలోల బంగారు చీరను బహూకరించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, కూన వెంకటేష్ గౌడ్, ఆలయ ఈవో అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగ హరిత విప్లవంలో మరో అపూర్వ ఘట్టానికి నాంది పలకనున్నారు. కోటి వృక్షార్చన పేరుతో గంట సమయంలో రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేశారు. 

ఉద్యమ స్పూర్తితో సాగనున్న ఈ బృహత్ కార్యక్రమంలో సినీతారలు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ పాలుపంచుకోనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో ఇందులో భాగం కానున్నారు. 

సీఎం కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని బుధవారం గ్రేటర్ లో అనేక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మంగళవారం మీడియాకు తెలిపారు. 

ఈ రోజు జరగబోయే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి..

- అమీర్ పేటలోని గురుద్వారాలో గురుగ్రంథ్ సాహెబ్ కు ప్రత్యేక పూజలు
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి అమ్మవారికి సమర్ఫణ. 
- సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కోటి కుంకుమార్చన, సికింద్రాబాద్ లోని గణేష్ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు
- క్లాక్ టవర్ దగ్గరున్న వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, నాంపల్లిలోని హజ్రత్ యుసిఫెన్ దర్గాలో చాదర్ సమర్పణ
- జలవిహార్ లో 10.30 గంటలకు జన్మదిన వేడుకలు ప్రారంభం. 10.30 గంటలకు త్రీడీ డాక్యుమెంటరీ.. 11.00 గంటలకు కేక్ కటింగ్ 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్