అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు(వీడియో)

By narsimha lodeFirst Published Aug 19, 2018, 9:32 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం కోసం ఇచ్చిన అడ్వర్‌టైజ్ మెంట్లో అధికారుల నిర్వాకంతో ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులపాలైంది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం కోసం ఇచ్చిన అడ్వర్‌టైజ్ మెంట్లో అధికారుల నిర్వాకంతో ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందులపాలైంది. తమ అనుమతి లేకుండానే ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం తన ఫోటోను వాడుకోవడమే కాకుండా  తన భర్త స్థానంలో మరో వ్యక్తి ఫోటోను ప్రచురించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలుగు పత్రికలతో పాటు, ఇతర భాషల పత్రికల్లో కూడ కోట్లు ఖర్చు చేసి చిన్న, పెద్ద పత్రికలకు అడ్వర్‌టైజ్ మెంట్స్ ఇచ్చింది. రైతు భీమా పథకం, కంటి వెలుగు పథకాలకు ఓ వివాహిత ఫోటోతో అడ్వర్‌టైజ్ మెంట్ ఇచ్చింది. అయితే రైతు భీమా పథకంలో తన భర్త ఫోటోతో యాడ్ ప్రచురించారు. కంటి వెలుగు పథకంలో వేరే వ్యక్తిని భర్తగా చూపుతూ యాడ్ ఇచ్చారు.

"

ఈ విషయమై సోషల్ మీడియాలో  ప్రచారం కావడంతో  బాధితురాలు  మీడియా ముందుకు వచ్చింది.ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన బాధితురాలిది పద్మ. ఆమె భర్త నాగరాజు. మూడేళ్ల క్రితం యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామం. తన కూతురికి స్నానం చేయిస్తుండగా కొందరు రుణాలు ఇప్పిస్తామని చెప్పి ఫోటోలు తీసుకొన్నారని బాధితురాలు చెప్పారు.

కనీసం తన ఫోటోను పేపర్లో, బస్సుల మీద వేసిన యాడ్ లో ప్రచురించడంతో తమ ఫోటో అని భావించినట్టు పద్మ మీడియాకు చెప్పారు. అయితే తన ఫోటో పక్కన వేరే వ్యక్తిని భర్తగా చూపిన విషయం తెలుసుకొని తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైనట్టు చెప్పారు.తన పక్కన వేరే వ్యక్తి  ఫోటోను ప్రచురించడంతో ప్రతి రోజూ తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు ఆమె చెప్పారు. 

ఈ వార్తలు చదవండి

కంటి వెలుగులో మారిన భర్త: ఏజెన్సీలకు నోటీసులు జారీ

 


 

click me!