కేరళ వరద బాధితులకు ఎంఐఎం ఆర్థిక సహాయం

By sivanagaprasad KodatiFirst Published Aug 19, 2018, 7:08 PM IST
Highlights

పర్యాటక స్వర్గధామం, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన కేరళ రాష్ట్రం వరుణుడి ప్రకోపానికి విలవిలలాడుతోంది. పదకొండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. దీంతో కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు పలు రాష్ట్రాలప్రభుత్వాలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, సినీనటులు మీడియా సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 

హైదరాబాద్: పర్యాటక స్వర్గధామం, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన కేరళ రాష్ట్రం వరుణుడి ప్రకోపానికి విలవిలలాడుతోంది. పదకొండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. దీంతో కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు పలు రాష్ట్రాలప్రభుత్వాలు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, సినీనటులు మీడియా సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 

తాజాగా ఎంఐఎం పార్టీ కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి విరాళం ప్రకటించింది. మజ్లీస్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంఐఎం కేరళ వరద బాధితులకు 16 లక్షల విరాళం అందజేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆదివారం ట్విటర్‌లో ప్రకటించారు. ఈ మొత్తాన్ని సోమవారం కేరళ సీఎం రీలిఫ్‌ ఫండ్‌ అకౌంట్‌లో జమ చేయనున్నట్లు తెలిపారు. 

అంతేకాకుండా 10 లక్షల రూపాయల మందులను కేరళకు పంపనున్నట్టు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేరళకు సహాయం అందజేయడానికి ముందుకు రావాలని ట్విట్టర్ ద్వారా కోరారు.

click me!