వరి ధాన్యం ఇష్యూ: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు భేటీ

By narsimha lode  |  First Published Dec 21, 2021, 3:31 PM IST

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రం నుండి తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన మంత్రుల బృందం మంగళవారం నాడు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు.


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి Piyush Goyal తో  తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు,ఎంపీల బృందం మంగళవారం నాడు న్యూఢిల్లీలో భేటీ అయింది. వానాకాలంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి నుండి లిఖితపూర్వక హామీని  ఇవ్వాలని తెలంగాణ మంత్రులు పట్టుబుడుతున్నారు. వానాకాలం Paddy ధాన్యం కొనుగోలు విషయమై  రెండు రోజులుగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం ఢిల్లీలోనే మకాం వేసింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర  గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు.

అయితే అంతకు ముందే  ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ  Bjp నేతలు  భేటీ అయ్యారు. బీజేపీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సర్కార్ పై సీరియస్ విమర్శలు చేశారు.వానా కాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ ఇచ్చింది. ఇప్పటికే 60 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని  తెలంగాణ మంత్రి niranjan reddy  తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉంది.భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో వరి కోతలే జరగని విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.

Latest Videos

undefined

also read:మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం, వారికేం పనిలేదా: తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫైర్

 జనవరి 15 వరకు వరి కోతలు కొనసాగుతాయని తెలంగాణ అధికారుులు చెబుతున్నారు.  40 లక్షల టన్నుల బియ్యం/60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు కేంద్రంతో రాష్ట్రానికి ఎంవోయూ కుదిరిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.  రాష్ట్రానికి ఇచ్చిన టార్గెట్ ను  పెంచాలని గతంలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీకి వచ్చి కేంద్రంతో చర్చించారని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు  విషయమై  కేంద్రం నుండి స్పష్టత రాలేదు.  అయితే  యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది. యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తోంది. అయితే బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేయలేమని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో రా రైస్ విషయంలో మార్చిలో ప్రకటన చేస్తామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది.  దీంతో యాసంగిలో  వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెప్పింది. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని కూడా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

అయితే వానా కాలం వరి ధాన్యం కొనుగోలు విషయమై కూడ కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసింది.పార్లమెంట్ లో సోమవారం నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ తో Trs ఎంపీల బృందం భేటీ అయింది. రాష్ట్ర మంత్రులు వరి ధాన్యం కొనుగోళ్లపై చర్చించడానికి వచ్చిన విషయాన్ని ఎంపీల బృందం తెలిపింది. దీంతో  ఇవాళ మధ్యాహ్నం  మంత్రుల బృందానికి  పీయూష్ గోయల్  అపాయింట్ మెంట్ ఇచ్చారు.

click me!