ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు ఒవైసీ ప్రయత్నం - బండి సంజయ్

By Sairam Indur  |  First Published Jan 3, 2024, 2:53 PM IST

అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని కరీంగనర్ ఎంపీ, బీజేపీ నాయకుడు బండి సంజయ్ అన్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు.


అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవ నేపథ్యంలో ఇటీవల ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. జనవరి 22న జరగనున్న రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మహిళలను గర్భవతిని చేస్తే రూ.13 లక్షల పారితోషికం.. ఆఫర్ బాగుందని వెళ్తే ఇక అంతే సంగతి..

Latest Videos

undefined

శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షింతలను కరీంనగర్ లోని చైతన్యపురి కాలనీలోని ఇళ్లకు బుధవారం బండి సంజయ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు ఒవైసీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

గృహలక్ష్మి పథకం రద్దు ... రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలెవరూ  కూడా వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని హిందువులు తమ వంతు సహకారం అందించారని, అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించారని బండి సంజయ్ అన్నారు. శ్రీరాముడి విగ్రహారాధన కార్యక్రమం కోసం వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు.

ఉద్యోగులకు 33 శాతం యాజమాన్య హక్కులు: చెన్నై ఐడియాస్2ఐటీ కంపెనీ బంపర్ ఆఫర్

కాగా.. ఇటీవల భావ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ.. రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం చేస్తున్న కార్యక్రమాల పట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ‘‘యువకులారా.. నేను మీకు చెబుతున్నాను. మనం మన మసీదును కోల్పోయాం. అక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. మీ గుండెల్లో బాధ లేదా..’’ అని అన్నారు.

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం, 12మంది మృతి, 30 మందికి గాయాలు..

మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేస్తే, మరెంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చామని ముస్లీం సమాజం గుర్తుంచుకోవాలని అసదుద్దీన్ సూచించారు. ఇప్పుడు మన మతమే ప్రమాదంలో వుంది... కాబట్టి ముస్లిం ప్రజలంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ఐకమత్యంతో వుంటేనే మన మనుగడ సాగుతుంది అనేలా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది. 

click me!