ఎమ్మెల్యే చల్లాపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Published : Feb 04, 2021, 06:19 PM IST
ఎమ్మెల్యే చల్లాపై ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

సారాంశం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  

హైదరాబాద్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ  ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓయూలోని దళిత, గిరిజన విద్యార్ధులు ఫిర్యాదు చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, కుల , ఉద్యోగ సంఘాలు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన విషయం తెలిసిందే.అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి విరాళాల విషయంలో కూడ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే