ఈటలకి సీఎం పదవివ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్

Published : Feb 04, 2021, 05:01 PM IST
ఈటలకి సీఎం పదవివ్వాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్

సారాంశం

 ఈటల రాజేందర్ సీఎం అవ్వాలనేది ప్రజల అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  

హైదరాబాద్: ఈటల రాజేందర్ సీఎం అవ్వాలనేది ప్రజల అభిప్రాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈటలకు సీఎంగా అవకాశం కల్పించాలని ఆయన టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. ఈటల లాంటి నాయకుడు ముందుకు వస్తే పలువురు ఎమ్మెల్యేలు మద్దతిచ్చే అవకాశం ఉందన్నారు. 

కేటీఆర్ సమర్ధుడే కావొచ్చు.. కానీ ఆయనకు వారసత్వం అనే విమర్శ ఉందన్నారు.కేసీఆర్ సీఎం పదవి నుండి తప్పుకొని కేటీఆర్ కు సీఎం పదవిని అప్పగిస్తారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఈ ఏడాది మార్చి లోపుగా  సీఎం మార్పు ఉంటుందనే ప్రచారం కూడ సాగుతోంది.

కేటీఆర్ కు సీఎం పదవిని కట్టబెట్టాలనే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే