Osmania University పరిధిలో పలు పరీక్షలు వాయిదా

By Rajesh KFirst Published Jan 17, 2022, 4:18 PM IST
Highlights

Osmania University: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ లో జనవరి 17 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేర‌కు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఆదేశాల‌ను జారీ చేసింది. అలాగే.. యూనివ‌ర్సిటీ విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.
 

Osmania University:  తెలంగాణలో క‌రోనా విజృంభిస్తోంది.  రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండ‌టంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు అలర్ట్ అయ్యారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో జ‌రిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు.  దీంతో యూనివ‌ర్సీటి ప‌రిధిలో ఈనెల 30 వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి.  పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు https://www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు సూచించారు.

ఉస్మానియా యూనివర్సిటీ జనవరి 17 నుంచి నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేర‌కు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఆదేశాలను జారీ చేసింది.  జనవరి 17 నుంచి జ‌న‌వ‌రి 31 మధ్య ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు TSCHE ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే.దీంతో వర్సిటీలోని అన్ని కాలేజీలకు కూడా ప్రభుత్వం జనవరి 17 నుంచి జనవరి 30 వరకు సెలవులు ప్రకటించిన విష‌యం తెలిసిందే.

ఈ సమయంలో విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం సెలవులను పొడిగించింది. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదాపడ్డాయి.

మ‌రోవైపు, ఈ నేప‌థ్యంతోనే అంబేద్క‌ర్ యూనివ‌ర్సిటీలు అన్ని ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  అదే త‌రుణంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎంటెక్, బీఈడీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ ప్ర‌క‌టించింది. కోవిడ్ దృష్ట్యా పరీక్షలు వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపింది. 

ఇప్ప‌టికే తెలంగాణలో మెడిక‌ల్ కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇత‌ర‌ విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. విద్యార్థులకు సంక్రాంతి సెలవులను ఈనెల 30 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేశాయి. దీంతో అన్ని యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. 

click me!