Bandi Sanjay: అరెస్టు పై బండి సంజయ్‌ ఫిర్యాదు.. ఇంకా నివేదిక అందించ‌ని తెలంగాణ స‌ర్కార్

By Rajesh KFirst Published Jan 17, 2022, 3:10 PM IST
Highlights

Bandi Sanjay: తనను అక్రమంగా అరెస్టు చేశారని బండి సంజయ్‌ కేంద్ర హోంశాఖకు , లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో తెలంగాణ ప్రభుత్వాన్నినివేదిక ఇవ్వలేదని పేర్కొంది. అయితే ..తెలంగాణ స‌ర్కార్ నివేదికను స‌మ‌ర్పించ‌లేద‌ని కేంద్రం తెలిపింది.  
 

Bandi Sanjay: తెలంగాణ పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పోలీసుల‌ కస్టడీ ఉన్న‌ప్పుడే లోక్ స‌భ‌ స్పీకర్‌కు లేఖ రాశారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు తన ప‌ట్ల వ్యవహరించిన తీరును వివ‌రిస్తూ ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసే క్ర‌మంలో తానో ఎంపీ న‌నే కనీస మర్యాద లేకుండా వ్యవహరించారని బండి సంజయ్‌ లేఖలో ఆరోపించారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ తీరుపై లేఖలో ప్రస్తావించారు. తిడుతూ.. భయపెడుతూ తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. సీపీపై చర్యలు తీసుకోవాలని లేఖలో బండి సంజయ్‌ పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర గవర్నర్ తమిళ సై‌, అమిత్‌షా, జెపీ నడ్డాకు సైతం బండి సంజయ్‌ లేఖలు పంపించారు.
 
అయితే.. తాజాగా.. బండి సంజ‌య్ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ .. ప్రివిలేజ్‌ కమిటీకి సమాధానమిచ్చింది. త‌మ‌కు అరెస్టుకు సంబంధించిన నివేదిక‌ను ఇంకా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. బండి సంజయ్‌ ఫిర్యాదును స్పీకర్‌ కార్యాలయం ప్రివిలేజ్‌ కమిటీకి పంపించింది. ఈ ఘటనపై ప్రివిలేజ్‌ కమిటీ కేంద్ర హోం శాఖ‌ను నివేదిక ఇవ్వాల‌ని కోరింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా నివేదిక‌ను సమ‌ర్పించ‌లేద‌ని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈనెల 21న లోక్‌సభ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ కానున్న‌ది.ఈ భేటీలో బండి సంజయ్‌ హాజరుకానున్నారు.

అస‌లేం జరిగిందంటే? 

ప్రభుత్వ ఉద్యోగుల‌ బదిలీలకు సంబంధించి కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిన జీవో 317కు వ్యతిరేకంగా ఎంపీ బండి కరీంనగర్ లోని తన క్యాంప్ కార్యాలయంలో జాగరణ దీక్ష చేప‌ట్టారు. కానీ బండి సంజయ్  దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ కార్యాలయంలో జరుగుతున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు కార్యాలయ గేటు తాళాన్ని పగలగొట్టారు. ఈ క్ర‌మంలో కాషాయ శ్రేణుల‌కు, ఖాకీల మ‌ధ్య ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ క్ర‌మంలో పోలీసులు బీజేపీ కార్యాల‌య‌ తలుపులు, అద్దాలు బద్దలుకొట్టి.. లోపలికి వెళ్లి సంజయ్‌ను బలవంతంగా అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. అయినా బండి సంజ‌య్ దీక్ష చేపట్టారు. 

మరుసటి రోజు ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు. ఈ క్ర‌మంలో బండి సంజయ్‌ను అరెస్టు  తీరునుతెలంగాణ హైకోర్టు త‌ప్ప‌బ‌ట్టింది.బండి సంజయ్‌ను  వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్‌ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంత‌రం తన అరెస్ట్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బండి సంజయ్.. లోక్​ సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. ఆయన దానిపై విచారణ జరపాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు.

click me!