గ్రూప్ 2 కి తాళిబొట్లకు సంబంధమేమిటి?

Published : Nov 12, 2016, 11:59 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
గ్రూప్ 2 కి తాళిబొట్లకు సంబంధమేమిటి?

సారాంశం

గ్రూప్ 2 పరీక్షలకు,  మంగళసూత్రాలకు, కాళ్ల మెట్టెలకు లింకేమిటో  కమిషన్ ఛెయిర్మన్ ఘంటా చక్ర పాణి వివరించాలని  విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు

 తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నగ్రూప్ 2 పరీక్షలకు,  మంగళసూత్రాలకు, కాళ్ల మెట్టెలకు లింకేమిటో  కమిషన్ ఛెయిర్మన్ ఘంటా చక్ర పాణి వివరించాలని ఉస్మానియా  విశ్వవిద్యాలయం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

 

నిన్న జరిగిన మొదటి పరీక్ష సందర్భాంగా అనేక పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు వివాహిత మహిళను  అవమాన పర్చడానికి వారు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు.

 

మంగళ సూత్రాలను, మెట్టెలను తీసివేస్తేనే పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తామని షరతు పెట్టడాన్ని వారు ప్రశ్నించారు.  ఇది తెలంగాణ  ఆడబిడ్డలను అవమానించటమే నంటూ ఇలా నియమాలుండటం  ప్రభుత్వానికి సిగ్గు చేటని వారు విమర్శించారు.

 

ఇది ఇలా ఉంటే, నిన్న జరిగిన గ్రూప్2 పరీక్ష నిర్వాహణలో పలు లోపాలున్నాయని ఈ లోపాల మూలంగా పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని లోపభూయిష్టంగా జరిగిన పరీక్ష పై విచారణ జరిపి అక్రమాలను బయటపెట్టాలని టిపిసిసి అధికార ప్రతినిధి కోటూరి మానవతా రాయ్ శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా అండగా తాము నిలబడతామని చెబుతూ డీ కోడింగ్ లేకుండా పరీక్ష ఎలా నిర్వహించారో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు.

 

డీ కోడింగ్ లేకుండా పరీక్ష నిర్వహిస్తే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఓ.ఏం.ఆర్ షీటుపై ఫోటోలు లేకుండా, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయకుండా ఎవరి పరీక్ష ఎవరు రాశారో తెలియని గందరగోళం లో పరీక్ష నిర్వహించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన పేర్కొన్నారు. డీకోడింగ్ లేకుండా   రేపు జరిగే గ్రూపు2పరీక్ష  అభ్యర్థుల కోరిక మేరకు వాయిదా వేసి పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలన్నారు. సింగరేణి ప్రశ్నాపత్రాల లీకు,ఎమ్సెట్2లీకు, నేడు గ్రూప్ టు జరిగిన తీరు చూస్తే మధ్యప్రదేశ్ లో  వ్యాపం  కుంభకోణాన్ని తలపించేట్లు  ఉందన్నారు.

 

అవగాహన లేని ఇన్విజిలేటర్ల మూలంగా ఒకరికి ఇవ్వాల్సిన బుక్ లెట్లను,ఓ.ఎం.ఆర్ షీట్లను మరొకరికి ఇచ్చి తప్పు తెల్సుకుని వైట్నర్ లతో తప్పు సరిదిద్దే ప్రయత్నం అక్రమాలకు తావివ్వటమేనన్నారు.

 

ఈ చర్యలను,కోర్టులు నింధనలు కూడా అంగీకరించవని తెలిపారు.ఈ పరిస్థితులలో న్యాయనిపుణులను సంప్రదించి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నది.ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు చేమకూరి శ్రీధర్ గౌడ్,బొమ్మా హనుమంతరావు,ఎగూరి ఉదయ్,  మల్లేష్ లు పాల్గన్నారు

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Weather Report: గ‌జ‌గ‌జ వ‌ణ‌కాల్సిందే, మ‌రింత పెర‌గ‌నున్న చ‌లి తీవ్ర‌త‌.. పూర్తిగా త‌గ్గేది ఎప్పుడంటే?
KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu