ఉస్మానియా మెడికల్ కాలేజీ ల్యాబ్‌ డేటా ఆపరేటర్‌కి కరోనా: వ్యాపారి మృతి

By narsimha lodeFirst Published Jun 12, 2020, 1:24 PM IST
Highlights

హైద్రాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ల్యాబ్ లో పనిచేస్తున్న డేటా ఆపరేటర్ కు కరోనా సోకింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ను శానిటైజేషన్ చేశారు అధికారులు. 


హైదరాబాద్: హైద్రాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ల్యాబ్ లో పనిచేస్తున్న డేటా ఆపరేటర్ కు కరోనా సోకింది. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ను శానిటైజేషన్ చేశారు అధికారులు. అంతేకాదు మూడు రోజుల పాటు ఈ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. మూడు రోజుల పాటు ఈ ల్యాబ్ ను మూసివేయనున్నారు.

also read:తెలంగాణలో కరోనా విశ్వరూపం: కొత్తగా 209 కేసులు, 9 మరణాలు.. 4,320కి చేరిన సంఖ్య

తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు సుమారు 45 మందికి కరోనా సోకిందని అధికారులు వారం రోజుల క్రితం ప్రకటించారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించారు. మరో వైపు ప్రధానమైన మూడు మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి కూడ కరోనా లక్షణాలు ఉండడంతో వారం క్రితమే 600 మందిని క్వారంటైన్ కి తరలించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గురువారం  నాడు కొత్తగా 209 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4320కి చేరుకొన్నాయి. తెలంగాణలో నమోదౌతున్న కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిల్లోనే ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కరోనా కేసులను కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ లో కూరగాయల వ్యాపారి కరోనాతో మరణించారు. దీంతో ఆయన కుటుంబాన్ని హోం క్వారంటైన్  చేశారు. బాపూజీ నగర్ తదితర ప్రాంతాలను బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని కంటైన్మెంంట్ జోన్ గా మార్చారు.
 

click me!