కరోనా లక్షణాలు లేవని డిశ్చార్జ్: 3రోజులకే తిరిగి గాంధీలో చేరిన ఇద్దరు

By Sree sFirst Published Jun 12, 2020, 12:19 PM IST
Highlights

సోమవారం నాడు గాంధీ నుండి కరోనా లక్షణాలు లేవు అని 50 సంవత్సరాల లోపు వయసున్న 310 మందిని హోమ్ క్వారంటైన్ కి తరలించగా... వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారని గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

కరోనా వైరస్ లక్షణాలు లేవు అని ప్రభుత్వ నూతన మార్గదర్శకాలను అనుసరించి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన పేషెంట్లలో, ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించిన సంఘటన గాంధీ ఆసుపత్రి పరిధిలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సోమవారం నాడు గాంధీ నుండి కరోనా లక్షణాలు లేవు అని 50 సంవత్సరాల లోపు వయసున్న 310 మందిని హోమ్ క్వారంటైన్ కి తరలించగా... వారిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించారని గాంధీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

హోమ్ క్వారంటైన్ ఎంతమాత్రమూ తప్పు కాదు. వైరస్ సోకిన వారిలో 60 శాతం మందికి రెస్ట్ ఇస్తే సరిపోతుంది. కాకపోతే వారు వేరే ఎవ్వరితో కలవకుండా క్వారంటైన్ ని ఖచ్చితత్వంతో మైంటైన్ చేయగలిగాలి. 

గ్రౌండ్ లెవెల్ లో అది ఎలా సాధ్యపడుతుందో అనేది మాత్రం సవాళ్లతో కూడుకున్న అంశం. ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినవారిని గుర్తుంచడం వారిని క్వారంటైన్ లో ఉంచడం లలో ఇప్పటికే వారు  బిజీ గా ఉన్నారు. ఈ కొత్త హోమ్ క్వారంటైన్ లని కూడా సమీక్షించడం వారికి తలకు మించిన భారమే అవుతుంది. 

వారు కొత్తగా వచ్చినవారిని చూసుకోవడం తోపాటుగా ఎవరికీ ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందన్న కూడా వారికి చికిత్స అందించవలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరింతమంది ఆరోగ్య సిబ్బందిని నర్సుల దగ్గరి నుండి మొదలు పారా మెడికల్ సిబ్బంది వరకు విధుల్లోకి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేర్పించుకోవాలిసిన అవసరం ఏర్పడింది. 

ఇకపోతే... తెలంగాణలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గురువారం కొత్తగా 209 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది.

మరోవైపు ఇవాళ కోవిడ్ 19తో 9 మంది మరణించడంతో మృతుల సంఖ్య 165కి చేరింది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 175 కేసులు నమోదు కావడంతో భాగ్యనగర వాసులు ఉలిక్కిపడ్డారు.

రాజధాని తర్వాత వరుసగా మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, వరంగల్ అర్బన్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 3, అసిఫాబాద్, సిద్ధిపేటలో రెండేసి చొప్పున, కరీంనగర్లో 3, ములుగు, కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 1,993 మంది కోలుకోగా.. 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

click me!