సమ్మె విరమించిన గాంధీ జూడాలు: 15 రోజుల డెడ్ లైన్, లేకుంటే....

By Sree sFirst Published Jun 12, 2020, 12:50 PM IST
Highlights

గాంధీలో గత మూడు రోజులుగా విధులను బహిష్కరిస్తూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న జూడాలు ఎట్టకేలకు తమ సమ్మెను విరమించారు. కానీ ఇది తాత్కాలికమేనని, 15 రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే తాము మరోసారి సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. 

గాంధీలో గత మూడు రోజులుగా విధులను బహిష్కరిస్తూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న జూడాలు ఎట్టకేలకు తమ సమ్మెను విరమించారు. కానీ ఇది తాత్కాలికమేనని, 15 రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే తాము మరోసారి సమ్మెకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. 

ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ తో జరిపిన చర్చలు ఒకింత సఫలమవడంతో వారి ఇలా షరతులతో కూడిన సమ్మె విరమణ ఒప్పందానికి వచ్చారు. గాంధీలో ఉన్న రోగుల అవస్థల దృష్ట్యా, ఆరోగ్యశాఖ మంత్రి న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామన్న హామీ దృష్ట్యా ఇలా షరతులతో కూడుకున్న ఒప్పందానికి తలొగ్గమని డాక్టర్లు తెలిపారు. 15 రోజుల్లో గనుక తమ డిమాండ్లను పరిష్కరించకుంటే...మళ్లీ తిరిగి సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. 

గాంధీలో కోవిడ్ తోపాటు ఇతర రోగాల చికిత్సను కూడా పేద ప్రజల అవసరాల దృష్ట్యా తిరిగి ప్రారంభించాలని, 30 శాతం అధిక మీడియాకెల్ సిబ్బందిని రిక్రూట్ చేయాలని, జిల్లాల్లోనే ఎక్కడికక్కడ కరోనా వైరస్ కి వికేంద్రీకరణ పద్ధతుల్లో ట్రీట్మెంట్ ను అందించేందుకు మంత్రి ఒప్పుకున్నట్టుగా డాక్టర్లు తెలిపారు. 

పీపీఈ కిట్ల క్వాలిటీ విషయంలో తమ అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని, కిట్లు కొనే ముందు ఒకసారి తమని కూడా వచ్చి చూడడానికి ఆహ్వానం పంపుతామని ఈటెల రాజేందర్ చెప్పారని జూడాలు అన్నారు. 

ఇకపోతే... తెలంగాణలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గురువారం కొత్తగా 209 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది.

మరోవైపు ఇవాళ కోవిడ్ 19తో 9 మంది మరణించడంతో మృతుల సంఖ్య 165కి చేరింది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 175 కేసులు నమోదు కావడంతో భాగ్యనగర వాసులు ఉలిక్కిపడ్డారు.

రాజధాని తర్వాత వరుసగా మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, వరంగల్ అర్బన్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 3, అసిఫాబాద్, సిద్ధిపేటలో రెండేసి చొప్పున, కరీంనగర్లో 3, ములుగు, కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 1,993 మంది కోలుకోగా.. 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

click me!