ఉస్మానియాలో మౌలిక వసతుల కొరత: సమ్మె నోటీసిచ్చిన జూడాలు

Published : Sep 08, 2020, 05:19 PM ISTUpdated : Sep 08, 2020, 05:28 PM IST
ఉస్మానియాలో మౌలిక వసతుల కొరత: సమ్మె నోటీసిచ్చిన  జూడాలు

సారాంశం

జూనియర్ డాక్టర్లు  మంగళవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.  

 హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు  మంగళవారం నాడు సమ్మె నోటీసు ఇచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు.

ఉస్మానియా ఆసుసత్రిలో  పనిచేసే జూనియర్ డాక్టర్లకు సరైన వసతులు లేవు. దీంతో సరైన వసతులు కల్పించాలని  జూనియర్ డాక్ట్లు డిమాండ్ చేస్తున్నారు. 48 గంటల్లో ఆపరేషన్ థియేటర్లను సిద్దం చేయాలని జూడాలు కోరారు. ఆక్సిజన్ పోర్టులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేని కారణంగా జూనియర్ డాక్టర్లు ప్రాక్టీకల్స్  చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.  ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో లేని కారణంగా జూడాలకు ప్రాక్టీకల్స్ లేకుండా పోయాయి. 

దీంతో మంగళవారం నాడు జూనియర్ డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. రెండు రోజుల్లో తమ డిమాండ్లను పరిష్కరించకపోతే అత్యవసర సేవలను కూడ బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ప్రస్తుతం కరోనా కేసుల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు  నెలకొనే అవకాశాలు లేకపోలేదు. దీంతో జూడాలు సమ్మెకు వెళ్లకుండా జూడాల సమస్యలను పరిష్కరించాలనే ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu