బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఓ ఉద్యోగికి పాజిటివ్

Siva Kodati |  
Published : Sep 08, 2020, 04:14 PM IST
బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఓ ఉద్యోగికి పాజిటివ్

సారాంశం

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. శాసనసభలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనిని పాస్‌లు జారీ చేసే కౌంటర్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. శాసనసభలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతనిని పాస్‌లు జారీ చేసే కౌంటర్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.

ఈ పరిణామంతో అసెంబ్లీకి వచ్చే ఇతర ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 28 వరకు అసెంబ్లీని నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజే ఒక ఉద్యోగికి పాజిటివ్‌ తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే అక్కడి అధికారులు, భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు.

వీటిలో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. అయినప్పటికీ ఈ ఉద్యోగికి పాజిటివ్‌ ఎలా వచ్చిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం