
హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను ఎంఐఎం వ్యతిరేకించింది. మంగళవారం నాడు ఉదయం తెలంగాణ అసెంబ్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సమయంలో జరిగిన చర్చకు ఎంఐఎం గైర్హాజరైంది. పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టుగా ఎంఐఎం తెలిపింది. అంతేకాదు సభ నుండి వాకౌట్ చేసింది.
also read:పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. టీఆర్ఎస్ తీసుకొన్న పలు కార్యక్రమాలకు ఎంఐఎం మద్దతుగా నిలిచింది. కానీ పీవీ నరసింహారావు విషయంలో ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకించింది.
ఈ తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇతర పక్షాలు కూడ మద్దతుగా మాట్లాడాయి. ఎంఐఎం మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది.