
గ్రూప్ 2లో జరిగిన అక్రమాలకు నిరసనగా ఓయూలో నిరుద్యోగ జెఏసి సోమవారం సాయంకాలం సిఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసింది. ఈకార్యక్రమానికి వందల సంఖ్యలో విద్యార్థుల హాజరయ్యారు. గ్రూప్ 2 పరీక్షజరిగిన తీరు నుంచి ఫలితాలు వెలువడే దాకా సాగి అవకతవకల మీద విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైట్నర్ వాడిన విద్యార్థుల పేర్లు కోర్టు తిరస్కరించినా ఎందుకు ఫలితాల జాబితాలో కొచ్చాయో సమాధానం చెప్పాలని వారు పట్టుబడుతున్నారు. ఇదేవిధంగా నిజాంబాద్ ఒకే సెంటర్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థుల ఉత్తీర్ణులు కావడం మీద కూడ ఈ విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు లేవదీస్తున్న ఇతర అంశాలు:
*వైట్నర్ వాడిన సుమారు 39వేలమంది అభ్యర్థుల జవాబు పత్రాలను సుప్రీంకోర్టు తీర్పు ను ధిక్కరించి ఎమి ఆశించి మూల్యాంకనం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
*నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు 1:2కాకుండా 1:3 ఏ ప్రాతిపదికన పిలిచారు? అదనంగా మరో 51మందిని ఎందుకు పిలిచారో సమాధానం చెప్పాలి.
*ఒకే పరీక్షా కేంద్రంలో 60మంది ఏవిధంగా ఇంటర్వ్యూకి ఎంపికయ్యరో సమాధానం కావాలి.
*రిజర్వేషన్ల వారిగా అందరి కటాప్ మార్కులు బహిర్గతం చేయాలి.
*వైట్నర్ వాడి కోర్టు కు వెళ్ళిన అభ్యర్థులు ఎట్లా ఇంటర్వ్యూ కి ఎంపికయ్యారో ఆ మతలబేంటో బహిర్గతం చేయాలి...
వీటన్నింటికి తగిన రీతి లో స్పందించి అనుమానాలు నివృత్తి చేయకపోతే, ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ తెలిపారు.