ఎమ్మెల్యే క్వార్టర్స్ , రూమ్ నెం 404.. దుర్గం చిన్నయ్య అసభ్యంగా ప్రవర్తించిందిక్కడే : వీడియో బయటపెట్టిన శేజల్

Siva Kodati |  
Published : Jun 07, 2023, 07:58 PM ISTUpdated : Jun 07, 2023, 07:59 PM IST
ఎమ్మెల్యే క్వార్టర్స్ , రూమ్ నెం 404.. దుర్గం చిన్నయ్య అసభ్యంగా ప్రవర్తించిందిక్కడే : వీడియో బయటపెట్టిన శేజల్

సారాంశం

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గయ్య చిన్నయ్యకు సంబంధించి మరో వీడియో విడుదల చేసింది ఆయన చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బోడపాటి శేజల్

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గయ్య చిన్నయ్యకు సంబంధించి మరో వీడియో విడుదల చేసింది ఆయన చేతుల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బోడపాటి శేజల్. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని 404 రూమ్‌లో దుర్గం చిన్నయ్య తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ మేరకు ఫోటోతో పాటు వీడియోను రిలీజ్ చేసినట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

కాగా.. దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నారంటూ గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న శేజల్ ఆత్మహత్యాయత్నం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె విషం తాగారు. దీంతో వెంటనే స్పందించిన తోటివారు శేజల్‌ను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

ALso Read: లైంగిక వేధింపులు .. ఢిల్లీలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆత్మహత్యాయత్నం

చిన్నయ్య తనను మానసికంగా , లైంగికంగా వేధిస్తున్నారని బోడపాటి శేజల్ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేపై జాతీయ మానవ హక్కుల కమీషన్, జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతి రోజు నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేను తక్షణం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కేసు నమోదు చేయాలని శేజల్ డిమాండ్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్