LokSabah Polls: తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒపీనియన్ పోల్స్ అంచనాలివే

Published : Mar 04, 2024, 09:04 PM IST
LokSabah Polls: తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఒపీనియన్ పోల్స్ అంచనాలివే

సారాంశం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. బీజేపీ ఐదు, బీఆర్ఎస్ రెండు సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని పేర్కొంది.  

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు రంగంలోకి దూకాయి. అభ్యర్థుల ప్రకటనలు మొదలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన జోష్‌తో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని ఆశపడుతున్నది. బీజేపీ కూడా దూకుడు మీదే ఉన్నది. బీఆర్ఎస్‌ ఉనికికి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఏ స్థాయిలో సీట్లు గెలుచుకుంటుందనే ఉత్కంఠ సహజంగానే ఏర్పడింది.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్ అంచనాల ప్రకారం 9 సీట్లును కాంగ్రెస్ గెలుచుకుంటుంది. ఇక బీజేపీ కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌ స్థానాలను గెలుచుకుంటుంది. ఇక బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితం కానుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: బ్రెజిల్ టూరిస్టుపై గ్యాంగ్ రేప్ ఘటనను సుమోటుగా స్వీకరించిన జార్ఖండ్ హైకోర్టు

2019లో బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఐదు, ఎంఐఎం ఒక్క సీటు గెలుచుకున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?