ఆన్‌లైన్ లోన్ కేసు: రోజుకు రూ.10 కోట్ల లావాదేవీలు గుర్తింపు, 16 మంది అరెస్ట్

By Siva KodatiFirst Published Dec 31, 2020, 3:41 PM IST
Highlights

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో 16 మంది అరెస్ట్ అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు. నిన్న ఢిల్లీలో ఈ స్కామ్ సూత్రధారి ల్యాంబో ఆలియాస్ జూబీని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు

ఆన్‌లైన్ లోన్ యాప్స్ కేసులో 16 మంది అరెస్ట్ అయినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ తెలిపారు. నిన్న ఢిల్లీలో ఈ స్కామ్ సూత్రధారి ల్యాంబో ఆలియాస్ జూబీని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ చెప్పారు.

అలాగే డాక్యుమెంట్లు రూపొందించిన నాగరాజును కూడా అరెస్ట్ చేశామని ఏసీపీ వెల్లడించారు. లిపైన్ కంపెనీతో నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.

ఈ కంపెనీ డైరెక్టర్ పల్లే జీవన జ్యోతిని సైతం అదుపులోకి తీసుకున్నామని... ఈ కంపెనీలను చైనా వ్యాపారస్తులే నిర్వహిస్తున్నట్లు గుర్తించామని ఏసీపీ పేర్కొన్నారు.

అయితే లీగల్ సమస్యలు రాకుండా ఇండియాకు చెందిన వ్యక్తుల పేరిట నగదు లావాదేవీలు, యాప్‌ల క్రియేషన్ చేశారని సైబర్ క్రైమ్ ఏసీపీ చెప్పారు. ఇందుకు సంబంధించి మొత్తం 351 మర్చంట్ ఖాతాలు, 205 నగదు ఖాతాలను గుర్తించామని తెలిపారు.

ప్రతిరోజు రూ.10 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ బాధితులున్నారని... ఈ కేసు విషయంలో పలు రాష్ట్రాల పోలీసులు సంప్రదిస్తున్నారని ఏసీపీ పేర్కొన్నారు. 

click me!