ప్రేమించి మోసం చేశాడని యువతి హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు: పోలీసుల ముందే యువతిపై ప్రియుడి దాడి

Published : Dec 31, 2020, 03:31 PM IST
ప్రేమించి మోసం చేశాడని యువతి హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు: పోలీసుల ముందే యువతిపై ప్రియుడి దాడి

సారాంశం

ప్రేమించి మోసం చేశాడని  ఫిర్యాదు చేసిన యువతిపై  పోలీసుల ముందే యువకుడు దాడికి దిగాడు. ఈ ఘటన హైద్రాబాద్ లోని మానవ హక్కుల కార్యాలయం ఆవరణలో గురువారం నాడు చోటు చేసుకొంది.

హైదరాబాద్: ప్రేమించి మోసం చేశాడని  ఫిర్యాదు చేసిన యువతిపై  పోలీసుల ముందే యువకుడు దాడికి దిగాడు. ఈ ఘటన హైద్రాబాద్ లోని మానవ హక్కుల కార్యాలయం ఆవరణలో గురువారం నాడు చోటు చేసుకొంది.

కవిత  అనే యువతి తనను ప్రేమించి మోసం చేశాడని ఆశోక్ అనే యువకుడిపై మానవహక్కుల కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.ఈ సమయంలో తనను ప్రేమ పేరుతో వాడుకొని ఎందుకు మోసం చేశావని బాధితురాలు ప్రశ్నించింది. ఆశోక్ ను ఈ విషయమై నిలదీసింది. దీంతో ఆగ్రహంతో ఆశోక్ ఆమెపై దాడికి దిగాడు. 

ప్రేమించి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఆశోక్ తన ఇంటికి పిలిచి దాడికి దిగారని ఆమె ఆరోపించారు.తనకు పోలీసుల నుండి న్యాయం జరగకపోవడంతోనే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించినట్టుగా ఆమె చెప్పారు.

తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. ఇదే విషయమై ఆమె హెచ్ఆర్ సీ లో ఫిర్యాదు చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?