సైబర్ క్రైమ్... మొబైల్ యాప్ లో పెట్టుబడి పేరిట ఘరానా మోసం

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 2:06 PM IST
Highlights

కేవలం మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందవచ్చని నమ్మించి హైదరాబాద్ కు చెందిన కొందరినుండి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. 

హైదరాబాద్: బ్యాంక్ అకౌంట్ వివరాలను సేకరించి అమాయకుల నుండి డబ్బులను కాజేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. అయితే ప్రజల్లో ఇలాంటి మోసాలపై అవగాహన పెరగడంతో కొంత తరహా మోసాలకు తెరతీశారు కేటుగాళ్లు. ఇలా మొబైల్ యాప్  డెవలప్ మెంట్ పేరుతో హైదరాబాద్ కు చెందిన కొందరిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. 

ఈ నేరానికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన అవినాష్ కుమార్ కు మొబైల్ యాప్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు పొందవచ్చంటూ కాల్ వచ్చింది. ఆ మాటలను నమ్మిన అవినాష్ రెండు లక్షలు వారి ఖాతాలో వేశాడు. అంతేకాదు తన స్నేహితులతో కూడా మరో రూ.10లక్షలు వేయించాడు. ఇలా లక్కీ స్టార్، జెన్సిక్ అనే మొబైల్ యాప్స్ లో  భారీగా పెట్టుబడి పెట్టించారు కేటుగాళ్లు. 

read more  వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో... యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్లు, రంగంలోకి సైబర్ క్రైమ్

వీరి నుండి డబ్బులు అందాక సదరు మొబైల్ యాప్ ను కేటుగాళ్లు డిలీట్ చేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన అవినాష్, అతడి స్నేహితులు సిటీ సైబర్ క్రైమ్ ను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. 
 

click me!