మహిళలంటే వ్రతాలే చేసుకోవాలా?: కేటీఆర్ పై షర్మిల ఫైర్

By narsimha lodeFirst Published Jul 16, 2021, 2:05 PM IST
Highlights


టీఆర్ఎస్‌లో మహిళలకు గౌరవం లేదని వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. కేటీఆర్, కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వరన్నారు. నిరుద్యోగుల సమస్యపై తాను దీక్షలు చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శలకు ఆమె కౌంటరిచ్చారు.


హైదరాబాద్:టీఆర్ఎస్ లో మహిళలకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ దృష్టిలో మహిళలంటే వ్రతాలు చేసుకోవాలి, వంటింట్లో ఉండాలన్నారు. మీటింగ్ జరిగితే మహిళా సర్పంచ్ కు  కనీసం కుర్చీ కూడా ఇవ్వరన్నారు.

also read:హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన వైఎస్ షర్మిల

నిరుద్యోగుల కోసం అన్నం మెతుకు ముట్టుకోకుండా మేం వత్రం చేస్తున్నామన్నారు. పెద్ద మొగోడు కదా .... కేటీఆర్ ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటిని భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  ఉద్యోగాలు భర్తీ చేస్తే మా వ్రతం ఫలించిందనుకొంటానని ఆమె చెప్పారు. రెండు రోజుల క్రితం నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నాడు దీక్ష చేయడంపై మంత్రి కేటీఆర్ సెటైరికల్ గా స్పందించారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వారం ఉంటుందన్నారు. షర్మిల కూడ నిరుద్యోగుల కోసం వ్రతం చేస్తున్నారన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.


 

click me!